కటువో మృదువో
పనికొచ్చే మాట చెప్పే మనిషి
కొద్దో గొప్పో
తనకన్నా నిన్ను బాగా తెలిసిన మనిషి
పొగిడొ తిట్టో
నువ్వు బగుండాలని కోరుకునే మనిషి
కష్టమో తేలికో
వెళ్లాల్సిన దారి చూపించే మనిషి
భయపెట్టో బ్రతిమాలో
నీలో నిజమైన నిన్ను నీకే పరిచయంచేసే మనిషి
గెలుపో ఓటమో
నమ్మకం తో నీ ప్రయత్నంలో తోడుండే మనిషి
తనను మించి యెదుగుతుంటే
తన్మయత్వంతో ఆనందించే మనిషి
నీ విజయం కోసం పాటుపడి
నీ గెలుపును ఆనండభాష్పాతో స్వాగతించే మనిషి
జనం నిన్ను పొగుడుతూంటే
గర్వంతో పొంగిపోయే మనిషి
చూసేందుకు చాలా మామూలు మనిషి
తరచి పరికిస్తే నీ మేలు కై తపించే మహర్షి
No comments:
Post a Comment