అడుగు
అది ముందుకు వేస్తే గెలుపవ్వాలి
ఆగితే ఆలోచన కొసం అయ్యి ఉండాలి
వెనుకకు పడితే తెలివి అయ్యి ఉండాలి
ముందుకెళ్లటం ధైర్యం
ఆగి ఆలోచించటం జాగ్రత్త
వెనక్కి తగ్గటం వివేకం
కానీ
వెనకడుగు అలవాటయిపోతే మాత్రం అది భయం
నీ పంచనేజేరి
నెమ్మదిగా యేమార్చి
నీలో నిప్పును నీరుగార్చి
నిలువలేవని నమ్మించి
నిశీధి లోతుల్లో నిద్రపుచ్చి
బద్దకమే నీరసంగా
నీ జీవితమే నిరర్థకంగా మార్చేస్తుంది
నీ చేత నీకే తీరని నమ్మకద్రోహం చేయిస్తుంది.
లే
నిన్ను నువ్వు గుర్తు తెచ్చుకో
నీ స్వేచ్చ నీకు నువ్వే ఇచ్చుకో
నీ కలకి నీ చేయూతనివ్వు
నీ రాక ని లోకానికి తెలియనివ్వు
భయం లేదు మిత్రమా
నీ గర్జనకి నీ మేక ముసుగు చిరిగిపోతుంది
గడ్డకట్టిన గిట్టలు పగిలి పంజాలవుతాయి
ఒళ్లు విరిచి జూలు విదిలిస్తే మేకతోలు ఎగిరిపోతుంది
పొగరు దిగిన ప్రపంచం పాదాల దగ్గరికొస్తుంది.. లే.. పద..
No comments:
Post a Comment