పని చేసి వచ్చిన వాడు అలిసిపోయి పడుకుంటాడు
మనసుకు నచ్చిన పని చేసేవాడు సంతృప్తిగా నిద్రపోతాడు
వాడు భయపడుతూ పడుకుంటాడు
బాధపడుతూ లేస్తాడు
వీడు ఆనందంగా నిద్రపోతాడు
ఆతృతగా లేస్తాడు
పని, తిండి పెట్టి బతికిస్తుంది
మనసుకి నచ్చిన పని తిండి పెట్టగలిగినా పెట్టలలేకపొయినా బతుక్కి అర్ధం ఇస్తుంది
పని, చేయగలిగినంత కాలం చూసుకుంటుంది
శక్తి తగ్గేకా ఇంటికి పంపేస్తుంది
మనసుకు నచ్చిన పని బతుకు లో తోడుగా ఉండి
చావు తర్వాత ఎన్నో మనసులకు మేధలకు నీడ అవుతుంది
తిండి తిప్పలు లేకుండా పనిచేయటం కష్టపడటం
తిండీ తిప్పలు మర్చిపోయి పనిచేయటం ఇష్టపడటం
నా దృష్టి లో
పనిలో పడి బతికేస్తూ కోట్లు కూడబెట్టినోడు కూడా
తన్మయత్వం లొ మునిగిపోయిన కళాకారుడి కంటే గొప్పగా బతకలేడు
No comments:
Post a Comment