ప్రతి మార్పూ కొత్త పుట్టుకే ప్రపంచానికి
వర్తమానపు అసమర్ధతలలో నలిగి
'సత్వా'గ్రహ బీజమై చరిగి
ఙ్ఞానాన్వేషణ లో ఒద్దికగా మునిగి
మేధోనాదం గా పెరిగి
పూర్వానుభవపు మంచి చెడుల తర్కమై
కళావేశాల కదలికలు తన ఉనికి ప్రకటనై
విషమూలాలగు వంచక మూకలపై గర్జనై
సామాజిక రుగ్మతల పడగలకెదురై
పెల్లుబిక్కిన విప్లవఘోష పురుటినెప్పులుగా
అమరవీరుల రుధిర ధారలు ఆయుధాలుగా
కాలగర్భ మూఢాంధకారాలు ప్రకంపించగా
విభజనల ఇనుపతెరలు పొరలుగా చిరుగగా
స్వేచ్ఛా వాయువు పీల్చుకున్న మార్పుగా
తన తొలి రోదన నవశకానికి నాందీనాదంగా
సరికొత్త సమసమాజ నిర్మాతగా నిలుస్తూ
తన తప్పటడుగుల తో అసమానతలను అనుస్తూ
అభ్యుదయ భావాలను పఠిస్తూ పాఠిస్తూ
యెదుగుతుంది కాలకన్యక తన గమనాన్ని తనే శాసిస్తూ
స్వయంభువుగా తననుతానే సృజియిస్తూ
Very good taruvatha eemayindi
ReplyDeleteMalli ade anthuleni kadha
DeleteAlaa repeat avthu untundhi sir