పదం ఏ భాషదైనా
అర్థం అమ్మభాషలోనే స్ఫురిస్తుంది..
వాక్యమెవరిదైనా
భావాన్ని మాతృభాషే బోధపరుస్తుంది
తాళపత్రముల నుండీ
కాగితముల తో కూడీ
దిక్కుతోచని నవతరానికి గుర్తింపుగా మరల పారాడి
అంతర్జాలయుగ సంకుల సుడిగుండాల పోరాడి
ఆచంద్రతారార్కమైన గత ఘన కీర్తుల శాహితే అస్థిత్వంగా
కుదరదని వదరి చెదరిన సంతతికి తన ఔచిత్యం చూపగా
ఉదయిస్తుంది మన నవకాంతుల కొత్త వెలుగు
తేనెలకు తీపి నేర్పే అమృతవాణి, నా తెలుగు..
Good
ReplyDeleteChala bagunde
ReplyDeleteతెలుగుదినోత్సవ శుభాకాంక్షలు... బాగుంది బావ... ఇలానే మన తెలుగు ని బ్రతికించుకుందాం...
ReplyDeleteVery nice
ReplyDelete