ఒరేయ్ మనిషీ
నిద్రలేపిన అలారానికి మొట్టికాయ వేస్తావు
లేస్తూనే సూర్యుణ్ణి తిడతావు
ఆదివారానికెన్నాళ్ళుంది అని లెఖ్ఖలేస్తావు
దూరానికి తగ్గ నిరాశ మొహాన పూస్తావు
ఋతువులు పట్టని బట్టలు మీదేసుకుంటావు
ముందుండేందుకు రోడ్డుల పడతావు
నవ్వు లో నిజం లేదు
నడత లో నిజాయితీ లేదు
తప్పు లో సిగ్గు లేదు,
పాపం పశ్చాత్తాపానికి దిక్కు లేదు
తెలిసీ తప్పదని తిట్టుకుంటూ నవ్వుతావు
తప్పని ఎరిగీ తలొంచుకు చేస్తావు
సిగ్గెందుకు పడాలని నిన్నే ప్రశ్నిస్తావు
పశ్చాత్తాపాన్ని గుమ్మం బయటే వదిలేస్తావు
నీతిమాలిన డబ్బు నెత్తిన కూర్చుని ఏం చెప్తే అది చేస్తావు
సాటి మనిషిని వదిలి నోట్ల కట్టలే నీవాళ్ళంటావు
డబ్బు కోసం ఎడతెగని పరుగు పెడతావు
కాలమో, మోసమో కాలడ్డినా పడిలేస్తావు
పరిగెడతావు పడిలేస్తావు
పరుగుల్లోనే బతికేస్తావు
చచ్చేంత కష్టం ఎదురొస్తే
చాన్నాళ్లుండవని తెలిసొస్తే
ఖరీదైన వైద్యం చేతులెత్తేస్తే
ఆదుకుంటుందనుకున్న అంతస్తు ఆవిరైపోతే
గడిచినేళ్ల గొడ్డు చాకిరీ వెక్కిరిస్తుంటే
చావునీ చెయ్యి పట్టి లాక్కుపోతుంటే
కనపడేదీ కడకు మిగిలేదీ
నువ్వొదిలేసిన కలలు
నిన్ను ప్రేమించే మనుషులు
చాలా బాగా వర్ణించారు. మరి ఈ కాలంలో బతకాలి అంటే ఈ పాట్లు తప్పవు. మానసిక వత్తిడికి గురి అవుతున్న మనిషి, బతకడానికి కష్టపడుతు, కష్టానికి ఫలితము లేకపోతే ఆందోళనకు గురి అవుతాడు.
ReplyDeleteఈ వర్ణనాతీతమైన బాధలని ఊటంకించటానికే మరో భాగం కూడా ఉంది.
DeleteSo
తరువాయి భాగం వచ్చేవారం..
Nice krishna liked it
ReplyDelete